Sat Dec 06 2025 17:30:27 GMT+0000 (Coordinated Universal Time)
అదే జోరు కొనసాగిస్తుందా?
భారత్ - ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. భారత్ రెండో మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది.

భారత్ - ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. భారత్ రెండో మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. అయితే భారత్ దూకుడుకు కళ్లెం వేయాలని ఇంగ్లండ్ గట్టిగా ప్రయత్నిస్తుంది. తొలి మ్యాచ్ లో అలవోకగా గెలిచిన భారత్ రెండో మ్యాచ్ లోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతుంది. ఇంగ్లండ్ కొద్ది మార్పులతో ఈ మ్యాచ్ లోకి బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మార్పు లేకుండానే....
అయితే తొలి మ్యాచ్ లో సాగినట్లుగా ఏకపక్షంగా రెండో మ్యాచ్ లో అవకాశం ఇవ్వకూడదని ఇంగ్లండ్ గట్టిగా భావిస్తుంది. టాప్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్లను పటిష్టంగా ఉండేలా ఇంగ్లండ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు భారత్ మాత్రం ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండానే దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొహ్లికి ఈ మ్యాచ్ లో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కొహ్లి గాయం నుంచి కోలుకుంటే జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
Next Story

