Sat Dec 06 2025 15:46:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భారత్ తో న్యూజిలాండ్ రెండో టీ 20
భారత్ - న్యూజిలాండ్ టీ 20 రెండో మ్యాచ్ నేడు జరగనుంది

భారత్ - న్యూజిలాండ్ టీ 20 రెండో మ్యాచ్ నేడు జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు. రెండు జట్లు టీ 20 వరల్డ్ కప్ సెమి ఫైనల్స్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ కూడా జరుగుతుందా? లేదా? అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. భారత్ మాత్రం భారీ మార్పులతో బరిలోకి దిగనుంది. ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారీ మార్పులతో...
హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా మూడు టీ 20లు న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉండగా ఒక్క మ్యాచ్ వరుణుడి దేవుడికి అంకితమయింది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ లు బరిలోకి దిగే అవకాశముంది. ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ తన ఫామ్ ను కోల్పోయాడు. చాలా కాలం నుంచి ఫామ్ లేమితో కనిపిస్తున్నాడు. ఈ మ్యాచ్ లోనైనా పంత్ వికెట్ కీపర్ గానే కాకుండా, బ్యాట్ తో ఝుళిపిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. న్యూజిలాండ్ కూడా బలంగా ఉంది. ఇరు జట్లు సమానబలంగా ఉండటంతో గెలుపు ఎవరది అన్నది చెప్పడం కష్టమే.
- Tags
- india
- new zealand
Next Story

