Tue Jan 27 2026 04:30:21 GMT+0000 (Coordinated Universal Time)
Sanju Samson : సంజూ శాంసన్ కు చోటు దక్కే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి?
టీం ఇండియా ఆటగాడు సంజూ శాంసన్ కు వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.

టీం ఇండియా ఆటగాడు సంజూ శాంసన్ కు వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. సంజూ శాంసన్ మంచి ఆటగాడు.హిట్టర్ కూడా. సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ గత సీజన్ లో సంజూ శాంసన్ మంచి రికార్డులను నెలకొల్పారు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా సంజూ శాంసన్ టీం ఇండియాకు మంచి అస్సెట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టీ 20లలో వరసగా విఫలమవుతూ వస్తుండటం కొంత ఫామ్ లో లేడని చెప్పడానికి వేరే ఉదాహరణలు ఏమీ అవసరం లేదు.
ఇషాన్ కిషన్ దుమ్మురేపుతుండటంతో...
మూడు టీ20 లలో తక్కువ పరుగులకే అవుట్ కావడంతో వచ్చే టీ20 వరల్డ్ కప్ కు సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకుంటారా? అన్న అనుమానం క్రమంగా బలపడుతుంది. టీం ఇండియాలో యువక్రికెటర్లకు కొదవలేదు. సంజూశాంసన్ కు అనేక మంది నుంచి విపరీతమన పోటీ ఉంది. అందులో ఇషాన్ కిషన్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. ఇషాన్ కిషన్ రెండు టీ 20లలో అదిరిపోయే పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ ఉంచి మరొకవైపు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా అందుబాటులోకి వస్తాడు.
తిలక్ వర్మ ఎంట్రీ ఖాయం...
తిలక్ వర్మ సర్జరీతో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను ఫిట్ నెస్ పరీక్షల్లో నెగ్గితే తిలక్ వర్మను తీసుకోవడం ఖాయం. అలాగే ఇషాన్ కిషన్ దూకుడు ను చూసిన బీసీసీఐ అతడిని మార్చే ఆలోచన పెట్టుకోలేదు. నాగ పూర్ లో పెద్దగా పరుగులు చేయలేకపోయినా రాయపూర్ లో టీం ఇండియా విజయానికి కారణం ఇషాన్ కిషన్ మాత్రమే. అలాగే గౌహతిలో జరిగిన మ్యాచ్ లోనూ సిక్సర్లు, ఫోర్లతో కాసేపు అలరించాడు. వరస వైఫల్యాలతో సంజూ శాంసన్ ను తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి రానున్న రెండు మ్యాచ్ లలోనైనా సంజూ శాంసన్ తన ఆట తీరును మెరుగు పర్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

