Thu Jul 17 2025 00:47:24 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : బెంగళూరు ప్లేఆఫ్ కు సగర్వంగా.. చెన్నై మీద కాలరెగరేసి గెలిచి మరీ
చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు లో జరిగిన మ్యాచ్ లోబెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.

ఐపీఎల్ 18వ సీజన్ లో ఒక క్లారిటీ వచ్చేసింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మరోసారి ప్లేఆఫ్ కు చేరుకుంది. ఎనిమిది విజయాలను సాధించి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పదహారు పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు లో జరిగిన మ్యాచ్ లోబెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. అయితే చివర వరకూ టెన్షన్ తప్పలేదు. మంచి స్కోరు సాధించినా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందేమోనని ఒక దశలో అనుకున్నారు. అయితే చివరకు మాత్రం విజయం బెంగళూరునే వరించింది. ఫలితంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.
అద్భుతమైన బ్యాటింగ్ చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బెతెల్ యాభై ఐదు పరుగులు చేశఆడు. విరాట్ కోహ్లి కూడా ఫామ్ లో కొనసాగుతుండటంతో 62 పరుగుల చేశఆడు. వారిద్దరు అవుటయిన తర్వాత బెంగళూరు కొంత వత్తిడికి లోనయినట్లు అనిపించింది. పడిక్కల్ పదిహేడు పరుగులకే పరిమితమయ్యాడు. రజిత్ పాటిదార్ కూడా పదకొండు పరుగులకే అవుట్ అయి నిరాశపర్చాడు. తర్వాత వచ్చిన జితేశ్ శర్మ కూడా నిరాశపరుస్తూ ఏడు పరుగులకే వెనుదిరిగాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 159 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 190 పరుగులకు మించి చేయదనిపించింది. కానీ చివర్లో వచ్చిన రొమారియో షెపర్డ్ నాటౌట్ గా నిలిచి 53 పరుగులు చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో పథ్నాలుగు బంతుల్లోనే సిక్సర్లు, ఫోర్లతో షెపర్డ్ మోత మోగించాడు. 53 పరుగులు చేయడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇరవై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.
భారీ లక్ష్యమే అయినా...
చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది భారీ లక్ష్యమే. ఎందుకంటే ఈ సీజన్ అంతా ఫామ్ లేమితో వరస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన జట్టు ఇంత పెద్ద స్కోరును ఏం ఛేజిస్తుందిలే అని అనుకున్నవారంతా మ్యాచ్ ప్రారంభమయిన తర్వాత నోళ్లెళ్ల బెట్టాల్సి వచ్చింది. అనూహ్యంగా చెన్నై అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆయుష్ 94 పరుగులు చేశాడు. రషీద్ 14 పరుగులకే అవుట్ అయినా సామ్ కరన్ ఏడు పరుగులకే వెనుదిరిగినా, జడేజా మాత్రంమరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడి 77 పరుగులు చేశాడు. ఈ దశంలో చెన్నై సూపర్ కింగ్స్ కు విజయావకాశాలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఓర్లు తక్కువగా ఉండటంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగింది. ధోని పన్నెండు పరుగులకే వెనుదిరిగాడు. శివమ్ దూబె పన్నెండు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిచా చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే రెండు పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం దక్కించుకుని ప్లే ఆఫ్ రేస్ కు చేరుకుంది.
Next Story