Fri Dec 05 2025 13:04:29 GMT+0000 (Coordinated Universal Time)
SRHvsRCB: అయ్యో ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ ముందు ఏంటో ఇలా!!
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ స్కోరును ఛేదించే సమయంలో బెంగళూరు జట్టు చతికిల పడిపోయింది. ఒకానొక దశలో ఆర్సీబీ విజయం పక్కా అని భావించగా, 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
232 పరుగుల ఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్సర్) శుభారంభం అందించారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు సాధించారు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (11), రజత్ పాటిదార్ (18), కెప్టెన్ జితేష్ శర్మ (15 బంతుల్లో 24) విఫలమయ్యారు. ఆర్సీబీ చివరి 7 వికెట్లను 16 పరుగుల తేడాతో చేజార్చుకుంది. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లతో పాటు, ఇషాన్ మలింగ రెండు వికెట్లు, జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.
Next Story

