Fri Dec 05 2025 22:47:53 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : చతికలపడిన ఛాలెంజర్స్.. కింగ్స్ ముందు తలవంచక తప్పలేదుగా?
బెంగళూరు సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలయింది.

ఐపీఎల్ లో మంచి అంచనాలతో ముందుకు వచ్చిన జట్లు సగానికి వచ్చేసరికి చతికలపడుతున్నాయి. అసలు ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన జట్లు మాత్రం పుంజుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అలాగే ఉంది. ప్రారంభంలో వరస విజయాలతో దూసుకు వచ్చిన జట్టు మధ్యలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తుంది. వరసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. నిన్నటి వరకూ పాయింట్ టేబుల్ లో మూడో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు ఓటమి పాలయి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్ లలో గెలిచి మూడు మ్యాచ్ లలో ఓటమి పాలయింది.
సొంత మైదానంలో...
బెంగళూరు సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలయింది. మంచిఫామ్ లో ఉన్న ఆటగాళ్లు సయితం ఆట ప్రారంభమయ్యే సరికి బ్యాట్ ఎత్తేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో సాల్ట్ నాలుగు పరుగులు చేసి అర్హదీప్ సింగ్ బౌలింగ్ చేతిలో అవుటయ్యాడు. అనసర షాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి ఒకటి, రజిత్ పాటిదార్ 23, లివింగ్ స్టన్ నాలుగు,జితేశ్ రెడు, కృనాల్ ఒకటి, డేవిడ్ యాభై పరుగులు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ ను పథ్నాలుగు ఓవర్లకు కుదిరించారు. పథ్నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసింది.
ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే...
తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రియాంశ్ ఆర్య 16 పరుగులు చేసి అవుటయ్యాడు. హేజిల్ ఉడ్ కూడా పదహారు పరుగులే చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులు జోష్ ఇంగ్లిస్ పథ్నాలుగు పరుగులు చేసి త్వరగా అవుటయినా నేహల్ వధేరా 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ మొత్తం 12.1 ఓవర్లలోనే 98 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్హదీప్ రెండు, బార్ట్ లెట్ ఒకటి, యాన్సెన్ రెండు, చాహెల్ హర్ ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీసి బెంగళూరు జట్టును దెబ్బతీశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, హేజిల్ వుడ్ మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు మూడో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
Next Story

