Wed Jul 16 2025 23:43:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెంగళూరుకు రాయల్ ఛాలెంజర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్ లో చాంపియన్ గా నిలిచింది. దీంతో నేడు బెంగళూరులో విక్టరీ పరేడ్ ను జట్టు నిర్వహించనుంది

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్ లో చాంపియన్ గా నిలిచింది. దీంతో నేడు బెంగళూరులో విక్టరీ పరేడ్ ను జట్టు నిర్వహించనుంది. దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్ గా అవతరించడంతో బెంగళూరు నగర వీధుల్లో పరేడ్ నిర్వహించేందుకు రాయల్ ఛాలెంజర్స్ సిద్ధమయింది. పంజాబ్ కింగ్స్ పై ఫైనల్స్ లో విజయం సాధించడంతో ఈ పరేడ్ ను నిర్వహించనున్నారు.
విక్టరీ పరేడ్ నిర్వహించనున్న...
అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు కు చేరుకోనున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు మధ్యాహ్నం 3.30 గంటలకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ విక్టరీ పరేడ్ ఉంటుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్స్ లో పోస్టు చేసింది. ఈ పరేడ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story