IPL 2025 : ఫలించిన స్వప్నం.. ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఛాంపియన్ గా నిలిచింది

అందరి ఆశలు ఫలించాయి. ప్రధానంగా కోహ్లి ఫ్యాన్స్ కు ఉన్న ఒకే ఒక కోరిక తీరిపోయింది. పద్దెనిమిదేళ్లుగా ఛాంపియన్ షిప్ కోసం ఎదురు చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల సాకారమయింది. ఎంత ఉత్కంఠ? చివర బంతి వరకూ టెన్షన్. అందరి కళ్లల్లో ఆనందంతో కూడిన నీళ్లు. ఒక్కసారి.. ఒక్కసారి తాము ఆరాధించే ఆటగాడి కళ్లల్లో ఆనందం చూడాలని ఏ అభిమానికి అయినా ఎవరికి ఉండదు? నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లి అభిమానులు ఆ ఆనందాన్ని చూశారు. కోహ్లి అనుభవించిన హ్యాపీనెస్ ను గ్రౌండ్ లో గెలిచిన తరుణంలో విరాట్ కళ్లలో నీళ్లు తిరగడం చూసి అభిమానులందరి గుండెలు బరువెక్కాయి. ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న కప్పు చేతికి వచ్చింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కోహ్లి.. కోహ్లి అంటే బెంగళూరు.. అందువల్లనే ఆ జట్టుకు అంత ఫ్యాన్స్. ఎప్పటిలాగే దురదృష్టం వెంటాడుతుందన్న భయం లోపల. గెలవాలన్న తపన. తమ జట్టు అని భావించే బెంగళూరు గెలిస్తే చాలు అని ప్రార్థించిన వాళ్లు ఎందరో. అది వారి కోసం. కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం. అదే విరాట్ కోహ్లి కోసం. అంతటి అభిమానం సంపాదించుకున్న విరాట్ కోహ్లి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరకు 2018 ఐపీఎల్ చాపింయన్ షిప్ ను అందుకోవడంతో బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.