Tue Jul 08 2025 18:20:43 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : లక్నో కు లక్కు లేదని మరోసారి రుజువయింది.. బెంగళూరుదే జయం
లక్నోలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్ ను చూశాం. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఏ మాత్రం తడబడలేదు. లీగ్ మ్యాచ్ లు ముగింపు దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్లు ఫామ్ లోకి వచ్చినట్లుంది. ఇప్పటి వరకూ లీగ్ మ్యాచ్ లలో పవర్ ప్లే కు చేరుకున్న జట్లను ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన జట్లను ఓడించడం చూశాం. అనేక జట్లు ఓడిపోవడంతో అతి విశ్వాసంతో ఓడిపోయాయని భావించాం. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం లీగ్ దశలోనూ తాము ప్లేఆఫ్ చేరినప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. లక్నోలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అద్భుతమైన ప్రదర్శన జట్టు చేసిందనే చెప్పాలి.
పంత్ సూపర్ సెంచరీ...
తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ మంచి ఆరంభంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మిచెల్ మార్ష్ 67 పరుగులు చేశడు. బ్రీజ్కే పథ్నాలుగు పరుగులకు అవుటయ్యాడు. రిషబ్ పంత్ ఫుల్లు ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకూ పంత్ తనపై ఉన్న అనుమానాలన్నింటినీ ఈ మ్యాచ్ తో పటాపంచలు చేశాడు. పంత్ నాటౌట్ గా నిలిచి 118 పరుగులు చేశాడు. షెఫర్డ్ పదమూడు, సమద్ ఒక పరుగుచేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఇరవై ఓవర్లలకు గాను మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. నిజానికి ఐపీఎల్ లో ఇది భారీ స్కోరు అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కోరును ఛేదించడం అంత సులువు కాదు.
అతి సులువుగా ఛేదించి...
కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అతిసులువుగా తన ముందున్న లక్ష్యాన్ని అధిగమించింది. ఛేదనలో తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో సాల్ట్ 30 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లి తనదైన స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి 54 పరుగులు చేశాడు. రజిత్ పాటీదార్ పథ్నాలుగు పరుగులకే అవుటయ్యాడు. లివింగ్ స్టన్ డకౌట్ అయి వెనుదిరిగాడు. మయాంక్ నాటౌట్ గా నిలిచి నలభై ఒక్క పరుగులు చేశాడు. ఇక జితేశ్ శర్మ మాత్రం నాటౌట్ గా నిలిచి 85 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తమకు లక్నో సూపర్ జెయింట్స్ విధించిన లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 230 పరుగులు చేసి విజయం సాధించింది.
Next Story