Fri Dec 05 2025 14:57:57 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఛేజింగ్ మాస్టర్ సూపర్ ఇన్నింగ్స్ .. పంజాబ్ వెన్ను విరిచిన బెంగళూరు
న్యూ ఛండీఘడ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వెన్నును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరిచేసింది

సొంతగడ్డపైన వరస ఓటములను చవి చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేరే మైదానంలో మాత్రం జూలు విదుల్చుతుంది. బెంగళూరులో తక్కువ మ్యాచ్ లు గెలిచి బయట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాచ్ లలో విజయం సాధించింది. న్యూ ఛండీఘడ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వెన్నును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరిచేసింది. రివెంజ్ తీర్చుకుంది. తమపై గెలిచిన ఉత్సాహంతో ఉన్న పంజాబ్ కింగ్స్ కు దాని సొంతమైదానంలోనే షాక్ కు గురి చేసింది. అలా ఉంటది కోహ్లి సేనతో పెట్టుకుంటే అన్నట్లు గా ఆడింది. ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐపీఎల్ లో ఇది అతి స్వల్ప స్కోరు అని చెప్పాలి. కానీ పంజాబ్ కింగ్స్ విషయంలో తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అది చివరలో మ్యాచ్ ను చేజిక్కించుకుంటుంది. అనేక మ్యాచ్ లలో అనేక సార్లు చూశాం. పంజాబ్ కింగ్స్ లో ప్రియాంశ్ ఆర్య 22 పరుగులు, ప్రభ్ మన్ సింగ్ 33 పరగులు చేసి ఓపెనింగ్ అదరగొట్టినా తర్వాత జోష్ ఇంగ్లిస్ తప్ప ఎవరూ రాణించలేకపోవడంతో తక్కువ పరుగులకే అవుటయ్యింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ఆరు పరుగులకే అవుటయి ఉసూరమనిపించాడు.
లక్ష్యాన్ని ఛేదించడంలో...
158 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే తడబడింది. సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయితే విరాట్ కోహ్లి, పడిక్కల్ కలసి రన్ రేటును పెంచారు. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. పడిక్కల్ 61 పరుగుల వద్ద అవుట్ కాగా, తర్వాత వచ్చిన రజిత్ పాటీదార్ పన్నెండు పరుగుల వద్ద అవుటయ్యాడు. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ కలసి ఇన్నింగ్స్ ను పూర్తి చేశారు. ఛేజింగ్ మాస్టర్ కోహ్లి 73 పరుగులు చేయడంతో పాటు తక్కువ పరుగులే లక్ష్యంగా ఉండటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం ముందే ఖరారయింది.
Next Story

