Sat Dec 13 2025 22:33:21 GMT+0000 (Coordinated Universal Time)
Renuka Singh : రేణుకా సింగ్ ఠాకూర్.. ఈ పేరు వింటే గూస్ బంప్స్ తప్పవు
మహిళల వన్డే ప్రపంచ ఛాంపియన్ గా భారత్ అవతరించడానికి జట్టులో ఉన్న రేణుక సింగ్ ఠాకూర్ కూడా ఒక కారణం

మహిళల ప్రపంచ కప్ మేనియా ఇంకా ఇండియాను వదిలిపోలేదు. ప్రపంచ కప్ ను గెలుచుకున్న తర్వాత ఎన్నో స్ఫూర్తిదాయకమైన వారి జీవితం వెలుగు చూస్తుంది. మహిళల వన్డే ప్రపంచ ఛాంపియన్ గా భారత్ అవతరించడానికి జట్టులో ఉన్న రేణుక సింగ్ ఠాకూర్ కూడా ఒక కారణం. తన కుమారుడు స్టార్ క్రికెటర్ కావాలని హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిిల్లా రోహాసిల్ తాలుకాలోని కొండ ప్రాంతంలో ఉన్న పర్సా గ్రామానికి చెందిన కేహార్ సింగ్ ఠాకూర్ బలంగా కోరుకున్నాడు. కానీ కుమారుడు క్రికెట్ పరంగా రాణించలేకపోయాడు.
తండ్రి కోర్కెను...
తన తండ్రి కేహార్ సింగ్ ఠాకూర్ కోరికను కుమార్తె రేణుకాసింగ్ ఠాకూర్ నెరవేర్చారు. కేహార్ సింగ్ ఠాకూర్ మరణించారు. కానీ తండ్రి కోరికను తాను నెరవేర్చాలన్న బలమైన కోరికను రేణుకాసింగ్ నెరవేర్చగలిగారు. కొండ ప్రాంతంలో ఉన్నానన్న సంగతి మర్చి పోయారు. బంతితో ఆడే విధానాన్ని గుర్తించిన ఆమె బాబాయి భూపేందర్ సింగ్ ఠాకూర్ గుర్తించాడు. ఆమెలో క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించిన భూపేందర్ సింగ్ తల్లిని ఒప్పించి ధర్మశాలలో ఉన్న క్రికెట్ అకాడమీలో చేర్చారు. అదే రేణుకా సింగ్ జీవితాన్ని మలుపు తిప్పింది.
బాబాయి ప్రోత్సాహంతో...
రేణుకా సింగ్ ఇక ఎక్కడా ఆగలేదు. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లింది. తనకు లభించిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. భారత్ జట్టులో చోటు సంపాదించుకునేలా చెమటోడ్చింది. తండ్రి కలను తన సోదరుడు నెరవేర్చకపోయినా తాను నెరవేర్చి తండ్రి కేహార్ సింగ్ ఠాకూర్ కలను నెరవేర్చింది. ఫైనల్ లో సౌతాఫ్రికాలో రేణుకాసింగ్ తనసత్తాను చాటింది. దేశానికే కాదు.. రాష్ట్రానికి, గ్రామానికి, దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టేలా చేసింది. అందుకే కంటే కూతురినే కనాలి అన్న సామెతకు రేణుకాసింగ్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది.
Next Story

