తండ్రి అని కూడా చూడకుండా.. బాదుడే బాదుడు
క్రికెట్లో తండ్రీకొడుకులు ఒకే మ్యాచ్‌లో ఆడటం అత్యంత అరుదు. అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ

క్రికెట్లో తండ్రీకొడుకులు ఒకే మ్యాచ్‌లో ఆడటం అత్యంత అరుదు. అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ విషయంలో అరుదైన విషయం చోటుచేసుకుంది. నబీ కుమారుడికి ప్రత్యర్థిగా బరిలో దిగాడు.
అఫ్గానిస్థాన్ ప్రీమియర్ టీ20 క్రికెట్ టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ లో మహ్మద్ నబీ మిస్ ఐనక్ రీజియన్ తరఫున బరిలోకి దిగాడు. అతడి కుమారుడు 18 ఏళ్ల హసన్ ఐసాఖిల్ అమో రీజియన్ జట్టుకు ఆడుతున్నాడు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా తొమ్మిదో ఓవర్ వేసేందుకు నబీ రాగా స్ట్రైక్ లో అతడి కుమారుడు ఉన్నాడు. తండ్రి అని కూడా చూడకుండా తొలి బంతిని హసన్ మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు. వేరే వాళ్ల బౌలింగ్ లో కుమారుడు సిక్స్ కొడితే ఏ తండ్రైనా ఆలోచించే వాడు. నబీ మాత్రం స్పందించలేదు. తన తొలి ఓవర్లో 12 పరుగులు ఇచ్చిన నబీ మరోసారి బౌలింగ్‌కు రాలేదు. ఈ మ్యాచ్‌లో హసన్ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మ్యాచ్ లో మాత్రం తండ్రి టీమ్ విజయం సాధించింది.

