Tue Apr 29 2025 08:18:22 GMT+0000 (Coordinated Universal Time)
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ దేన్నీ ధ్వంసం చేయలేదు.. అవన్నీ అబద్ధాలేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టు ఓడిపోవడంతో MS ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో టెలివిజన్‌ను పగలగొట్టాడంటూ వచ్చిన వార్తలను చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ టామీ సిమ్సెక్ ఖండించాడు. ధోని దేన్నైనా పగలగొట్టడం తాను ఎప్పుడూ చూడలేదని సిమ్సెక్ వివరించాడు.
2024 ఐపీఎల్ సీజన్ లో థ్రిల్లర్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ లో RCB చేతిలో ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే-ఆఫ్‌కు చేరుకునే అవకాశాన్ని కోల్పోవడంతో MS ధోని నిరాశకు గురయ్యాడని కొన్ని మీడియా నివేదికలు తెలిపాయి. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే మార్గంలో టెలివిజన్ స్క్రీన్ ను ధ్వంసం చేశాడని కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ అబద్ధాలని, ఎలాంటి నిజం లేదంటూ కోచ్ టామీ సిమ్సెక్ తెలిపారు.
మే 18న M.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలకమైన మ్యాచ్ లో, RCB 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 201 పరుగుల ఛేజింగ్‌లో సూపర్ కింగ్స్ విఫలమైన తర్వాత MS ధోని మ్యాచ్ ముగిసిన తర్వాత కనీసం కనిపించలేదంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

Next Story