Mon Mar 30 2026 11:00:31 GMT+0530 (India Standard Time)
IPL 2026 :ఐపీఎల్ లో నేడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్
. చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది

ఐపీఎల్ లో నేడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో మాత్రం ఈరోజు జరిగే మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ఆడటం లేదు. దీంతో ధోనీ అభిమానులకు ఒకింత నిరుత్సాహమని చెప్పాలి.
చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్...
సంజూ శాంసన్ చెన్నై జట్టులో చేరడంతో జట్టు బలం మరింత పెరిగింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో రాజసస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ నాయకత్వంలో బరిలోకి దిగుతుంది. వైభవ్ సూర్యవంశీ బరిలో ఉండటంతో ఈ రోజు కూడా భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈరోజు కూడా క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అని చెప్పాలి.
Next Story

