Fri Dec 05 2025 16:22:13 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : చెన్నైకు ఈ మ్యాచ్ లోనూ అపజయమే.. విజయం రాజస్థాన్ దే
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది

ఐపీఎల్ చివరి దశకు చేరుకున్న సమయంలో ప్లేఆఫ్ కు ఏమాత్రం సంబంధంలేని మ్యాచ్ జరిగింది. ఏదో ఆడామంటే ఆడామని కాకున్నా విజయం కోసంఇరు జట్లు తుదికంటా పోరాడాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది పండగే కావచ్చు. కానీ ఎవరు గెలిచినా జరగబోయేది ఏదీ ఉండదు. అందుకే నామమాత్రపు మ్యాచ్ లో గెలుపు, ఓటములకన్నా రికార్డుల కోసం ప్రయత్నించాలని ఆటగాళ్లు ఎక్కువగా భావిస్తారు. కానీ ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటిలాగానే ఓటమి పాలయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో అత్యంత పేలవంగా ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉందటే అది చెన్నై సూపర్ కింగ్స్.
ధాటిగా ఆడాలని...
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ లో ఆయుష్ 43 పరుగులు చేశాడు. కాన్వే పది పరుగులకే వెనుదిరిగాడు. ఉర్విల్ డకౌట్ తో పెవిలియన్ దారి పట్టాడు. అశ్విన్ కూడా పదమూడు పరుగులతో ముగించాడు. జడేజా ఒక పరుగుతో సరిపెట్టుకున్నాడు. బ్రెవిస్ కొంత దూకుడుగా ఆడి నలభై రెండు పరుగులు చేశాడు. శివమ్ దూబె కూడా 39 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు రావడంలో తన పాత్రను పోషించాడు. ధోని పదహారు పరుగులు, అన్హుల్ నాటౌట్ గా నిలిచినా చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది.
తక్కువ పరుగుల లక్ష్యమే....
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఇద్దరూ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. యశస్వి జైశ్వాల్ 36 పరుగుల చేసి అవుటయ్యాడు. వైభవ్ సూర్య వంశీ యాభై ఏడు పరుగులు చేశాడు. శఆంసన్ నలభై ఒక్క పరుగులు చేశఆడు. పరాగ్ మూడు పరుగులకు అవుటయినా జురెల్ నాటౌట్ గా నిలిచి 31 పరుగుల చేశాడు. హెట్ మెయర్ నాటౌట్ గా నిలిచి పన్నెండు పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విధించి 187 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ ముగించింది నాలుగు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించాయి.
Next Story

