Fri Dec 05 2025 13:17:11 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : రాయల్స్ కు టైం కలసి రావడం లేదు.. లక్నో లక్కు కలసి వచ్చినట్లుంది
జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలయింది.

రాజస్థాన్ రాయల్స్.. పాపం ఈ సీజన్ లో మాత్రం ఎందుకో తేలిపోతుంది. ఎడారి రాష్ట్రం పేరు పెట్టుకున్న ఈ జట్టు తడి ఆరిపోయినట్లు జట్టు స్కోరు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. గెలుపు వరకూ వచ్చి చివరకు అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా రాజస్థాన్ రాయల్స్ కు కలిసి రావడం లేదు. దాని రాత.. గీత రెండూ మారడటం లేదు. చివరి ఓవర్ లో ఉత్కంఠకు గురై చేతికొచ్చిన విజయాన్ని ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ నిలుస్తుందన్న నమ్మకం ఎంత మాత్రం కనిపించడం లేదు. జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలయింది.
తక్కువ పరుగులే చేసినా...
రాజస్థాన్ రాయల్స్ కు టైం బాగాలేదనిపిస్తుందనడానికి వరసగా రెండు మ్యాచ్ లు చేతిలోకి వచ్చి చేజారపోవడమే నిదర్శనం. ముందుగా బ్యాటింగ్ చేసినలక్నో సూపర్ జెయింట్స్ లో మార్ష్ కేవలం నాలుగు పరుగులకే అవుటయ్యాడు. మార్ క్రమ్ మాత్రం నిలబడి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. మార్ క్రమ్ 66 పరుగులు చేయడంతో పాటు పూరన్ పదకొండు పరుగులు, పంత్ మూడు, బదోనీ 50 పరుగులు, మిల్లర్ నాటౌట్ గా నిలిచి ఏడు, సమద్ కూడా నాటౌట్ గా నిలిచి 30 పరుగులు చేయడంతో 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజానికి ఇది పెద్ద స్కోరేమీ కాకపోయినా రాజస్థాన్ రాయల్స్ తన సొంత మైదానంలో గెలుపు ముంగిట నిలుస్తుందని అందరూ అంచనా వేశారు.
మూడు పరుగుల తేడాతోనే...
రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైశ్వాల్ మరోసారి బ్యాట్ ను ఝుళిపించాడు. 74 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. ఇక సూర్యవంశీ 34 పరుగులు చేయడతో పాటు నితీష్ ఎనమిది, పరాగ్ 39 పరుగుల, జరెల్ నాటౌట్ గా నిలిచి ఆరు హెట్ మయర్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ పన్నరెండు పరుగులు, శుభమ్ పన్నెండు పరుగులు చేశాడు. ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ కేవలం 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే విజయానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉండిపోయింది. చివరి ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ కు తమ చేతుల నుంచి విజయాన్ని అప్పగించేసింది. రెండు పరుగులు చేసినా మళ్లీ సూపర్ ఓవర్ వచ్చేది. అది కూడా మిస్ అయింది.
Next Story

