Fri Dec 05 2025 13:57:46 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : గుజరాత్ కు తప్పని ఓటమి.. రాజస్థాన్ ఊదిపారేసిందిగా
జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించింది

ఐపీఎల్ తుది దశకు చేరుకున్న సమయంలో ఎన్నో చిత్రాలు.. విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ రాజస్థాన్ రాయల్స్ కు వరస ఓటములు తప్ప విజయాలు దక్కలేదు. గత సీజన్ లో ఒక ఊపు ఊపిన ఈ జట్టు ఈసారి మాత్రం డీలా పడినట్లు కనిపించింది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కు పరాజయాలే ఇప్పటి వరకూ పలకరించాయి. గెలుపు లేకుండా అది ప్లే ఆఫ్ కు చేరుకోకుండానే ఈ సీజన్ లో నిష్క్రమిస్తుందని అందరూ బాధపడ్డారు. కానీ నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించి ఈ సీజన్ లో మూడో విజయం సొంతం చేసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కు మళ్లీ ఊపు లభించినట్లయింది.
మంచి ఆరంభంతో...
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మంచి ఫామ్ లో ఉంది. అన్ని విజయాలే. దానికి ఓటమి అనేది తెలియకుండా ఇప్పటి వరకూ ప్రయాణం కొనసాగిస్తుంది. అలాంటి గుజరాత్ టైటాన్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఒక వికెట్ తీయడానికి రాజస్థాన్ రాయల్స్ కు చాలా సమయం పట్టింది. సాయిసుదర్శన్ 39 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ కెప్టెన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 84 పరుగులు చేశాడు. ఇక తర్వాత స్థానంలో వచ్చిన బట్లర్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. బట్లర్ కూడా అర్థ శతకం పూర్తి చేసుకుని కాని మైదానం వదలలేదు. గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆర్చర్ ఒకటి, తీక్షణ రెండు, సందీప్ ఒకటి మాత్రమే వికెట్లు తీయగలిగారు.
కష్టమేనని భావించినా...?
తర్వాత ఛేదనలోకి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఇది కష్టమేమో అని అనిపించింది. అయితే జైపూర్ కావడం.. సొంత గడ్డపై ఖచ్చతంగా ఈ మ్యాచ్ లోనైనా గెలుస్తుందన్న నమ్మకంతో బరిలోకి దిగిన జట్టు ఇక విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్ లో ఓపెనర్లుగా దిగిన యశస్వి జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీలు కూడా అదరగొట్టే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ క్రీజులో ఉండటంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులు తీసింది. రన్ రేటు వీరిద్దరి ముందు చిన్న బోయింది. యశస్విజైశ్వాల్ 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కొత్త కుర్రాడు వైభవ్ సూర్య వంశీ 101 పరుగులు చేశాడు. నితీశ్ రాణా నాలుగు పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం ఖాయమైంది. 209 పరుగులను కేవలం 15.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 212 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
Next Story

