Sat Apr 11 2026 09:25:39 GMT+0530 (India Standard Time)
IPL 2026 : ఆర్సీబీపై రాజస్థాన్ విక్టరీ.. సమఉజ్జీల సమరంలో పై చేయి రాయల్స్ దే
గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది.

రెండు సమఉజ్జీల మధ్య జరిగిన సమరంలో చివరకు రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. వర్షంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయినప్పటికీ ఇరవై ఓవర్లు రెండు జట్ల మధ్య జరిగింది. ఇరు జట్లు ఇప్పటి వరకూ ఓటమి చవి చూడకపోవడంతో ఎవరిది గెలుపు అన్న ఉత్కంఠకు తెరపడింది.
పద్దెనిమిది ఓవర్లలోనే...
రాజస్థాన్ రాయల్స్ 202 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే చేరుకుని రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాజస్థాన్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగించింది.వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి ఛేదనకు బలమైన పునాది వేశారు. మధ్యలో వరుసగా రెండు వికెట్లు పడినా జట్టు నియంత్రణ కోల్పోలేదు. ధ్రువ్ జురెల్ 43 బంతుల్లో అజేయంగా 81 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అతని ఆత్మవిశ్వాసం రాజస్థాన్‌కు లక్ష్యం చేరువ చేసింది. రవీంద్ర జడేజా స్థిరంగా ఆడుతూ మంచి మద్దతు అందించారు. దీంతో ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే రాజస్థాన్ లక్ష్యాన్ని అందుకుంది. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. అయినా రాజస్థాన్ దూకుడును అదుపు చేయడంలో విఫలమయ్యారు. ధ్రువ్‌జురెల్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 రన్స్ కొట్టాడు. జడేజా 24, జైస్వాల్ 13, రియాన్ పరాగ్ 3, హెట్మయర్ సున్నా పరుగులు చేశారు. వైభవ్ ఔటైన తర్వాత రాజస్థాన్ ఓ దశలో తడబడింది. అయితే జురెల్, జడేజా క్రీజులో పాతుకుపోవడంతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి బంతికే తొలి వికెట్ కోల్పోయింది. సాల్ట్ తొలి బంతికే అవుటయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లి, రజిత్ పాటిదార్ లు ఇద్దరు నిలకడగా ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ , హేజెల్‌వుడ్ రెండేసి వికెట్లు తీయగా మిగిలినవారు విఫలమయ్యారు. అంతకుముందు ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 40 బంతుల్లో 63 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 32, వెంకటేశ్ అయ్యర్ 29, రొమారియో షెఫర్డ్ 22 పరుగులు చేయగలిగారు. . రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవిబిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. సందీప్ శర్మ, జడేజా చెరో వికెట్ తీశారు. బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగా, రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Next Story

