Wed Feb 08 2023 07:25:27 GMT+0000 (Coordinated Universal Time)
ఫైనల్స్ కు చేరుకున్న సింధు.. పతకం కన్ఫర్మ్
కామన్వెల్త్ గేమ్స్-2022లో పీవీ సింధు పతకం సొంతం చేసుకుంది.

కామన్వెల్త్ గేమ్స్-2022లో పీవీ సింధు పతకం సొంతం చేసుకుంది. సింధు సెమీ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన జియా మిన్ను ఓడించింది. తొలి గేమ్‌లో సింగపూర్ క్రీడాకారిణి నుంచి భారత స్టార్‌కి గట్టి సవాలు ఎదురైనప్పటికీ, సింధు తన అనుభవాన్ని చక్కగా ఉపయోగించి తొలి గేమ్‌ను 21-19తో, రెండో గేమ్‌ను 21-17తో గెలిచి ఫైనల్లోకి ఎంటర్ అయింది. ఇప్పటి వరకూ సింధు కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెలవలేదు. ఈసారి అయినా బంగారు పతకం సింధు గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీపై సింధు గెలుపొందింది. తొలి సెట్లో 19-21 తేడాతో ఓటమి పాలైన సింధు .. రెండో సెట్లో తిరిగి పుంజుకుని 21-14తో అద్భుతమైన విజయం సాధించింది. మూడో సెట్లో 21-18తో విజయాన్ని అందుకుని సెమీస్‌లో సింధు అడుగు పెట్టింది.
Next Story