Thu Jul 17 2025 00:07:33 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ముంబయికి బైబై.. ఇక పంజాబ్ కింగ్స్ ఫైనల్స్ కు
అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది

ఐపీఎల్ ఫైనల్స్ కు పంజాబ్ కింగ్స్ వచ్చేసింది. ముంబయికి ఛాంపియన్ షిప్ ముఖం చాటేసింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో ఓటమి పాలయిన పంజాబ్ కింగ్స్ ఇక కోలుకుంటుందో? లేదో? అన్న అనుమానాలకు తెరదించింది. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన క్వాలిఫయిర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో ఈ నెల 4వ తేదీన అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్స్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడుతుంది. పంజాబ్ కింగ్స్ ఒక్కసారిగా ఫైనల్స్ కు దూసుకెళ్లడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ముంబయి మంచి లక్ష్యాన్ని విధించినా...
ఈ మ్యాచ్ కు వరుణుడు కూడా సహకరించలేదు. దాదాపు రెండు గంటల పాటు వర్షం పడటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు బయలుదేరిన సమయంలో చివరకు మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిచిన పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా దిగిన ముంబయి ఇండియన్స్ కు ప్రారంభంలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ ఎనిమిది పరుగుల వద్ద అవుట్ కావడంతో జట్టుకు ఇబ్బందిగా మారింది. బెయిర్ స్టో 38 పరుగులు చేశఆడు. తిలక్ వర్మ 44 పరుగులు చేసి పరవాలేదని పించినా అవుట్ కావడంతో సూర్యకుమార్ యాదవ్ కూడా 44 పరుగులు చేశాడు. నమద్ ధీర్ 37 పరుగులు చేయడంతో ముంబయి ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేయగలిగింది. మంచి లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ముందు ఉంచగలిగామన్న ధీమాతో ఉంది.
ఛేదనలో తడబడకుండా...
అయితే కసితో ఉన్న పంజాబ్ మాత్రం ఈ ఛాన్స్ ను వదిలిపెట్టదలచుకోలేదు. చాలా రోజుల తర్వాత దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. ప్రియాం్ ఆర్య ఇరవై పరుగులు చేసి అవుటయినా, ప్రభ్ సిమ్రాన్ ఆరు పరుగులు చేసి వెనుదిరిగినా వెనుకంజ వేయలేదు. ఇంగ్లిస్ చక్కటి ఫామ్ లో ఉండటంతో 38 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లను ఒక ఆటాడేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 87 పరుగులు చేయడంతో పాటు వదేరా నలభై ఎనిమిది పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. నాలుగు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ పై అద్భుతమైన విజయాన్ని అందుకుని ఫైనల్స్ లోకి ప్రవేశించింది.
Next Story