Tue Jul 08 2025 17:45:20 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : సొట్టబుగ్గల సుందరి ఆనందం చూశారా? పంజాబ్ గెలిచిన తర్వాత జరపుకున్న పండగ ఎలా ఉందంటే?
ఐపీఎల్ ఫైనల్స్ కు పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు ఫైనల్స్ కు చేరింది. 2014 తర్వాత ఫైనల్ కు చేరుకోవడంతో ఆ జట్టులో చెప్పలేని ఆనందం నెలకొంది

ఐపీఎల్ ఫైనల్స్ కు పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు ఫైనల్స్ కు చేరింది. 2014 తర్వాత ఫైనల్ కు చేరుకోవడంతో ఆ జట్టులో చెప్పలేని ఆనందం. ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించి సగర్వంగా ఫైనల్స్ కు పంజాబ్ కింగ్స్ చేరుకుంది. పంజాబ్ కింగ్స్ కు ఈసారి కూడా అదృష్టం మొఖం చాటేస్తుందేమోనని అందరూప అనుకున్నారు. ఎందుకంటే ముంబయి ఇండియన్స్ కు లక్కు అలా కలసి వస్తూ క్వాలిఫయిర్ 2 మ్యాచ్ వరకూ వచ్చింది. అందుకే పంజాబ్ కింగ్స్ పై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఆ జట్టు యజమాని ప్రీతి జింటా దగ్గర నుంచి పంజాబ్ ఫ్యాన్స్ మొత్తం టెన్షన్ తో అహ్మదాబాద్ స్టేడియంలో ఊపిరి బిగపట్టి మ్యాచ్ ను చూశారు.
అదరని.. బెదరని..
కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం ఏ మాత్రం బెదరలేదు. అదరలేదు. ప్రధానంగా కింగ్స్ లో ఫైనల్స్ లో తలపడాలన్న కసి కనిపించింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కావడంతో ఆశలున్నప్పటికీ దానికి పెద్దగా అవకాశాలు ఉండవని అందరూ అంచనా వేశారు. అందరూ అదే భావించారు. కానీ పంజాబ్ కింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. అందుకోసమే స్టేడియంలో కూర్చున్న వారంతా అందరూ ఒక్కసారిగా లేచి నిల్చుని స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. సొట్టబొగ్గల సుందరి ప్రీతి జింటా ఆనందానికి అయితే ఇక అవధులు లేవు. లేచి గంతులేశారు. తన జట్టు సభ్యులకు అందులోనూ గెలిపించిన శ్రేయస్ అయ్యర్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఈసారి కూడా ఛాంపియన్ షిప్ ను...
ముంబయి ఇండియన్స్ ఈసారి కూడా ఫైనల్స్ కు వెళ్లి ఆరోసారి ఛాంపియన్ షిప్ గెలవాలని కలలు కనింది. ఐపీఎల్ ప్రారంభంలో కొద్దిగా తడబడినా ఆ జట్టు అందుకున్న విజయాలు, అనంతరం వరసగా సాధిస్తూ పైకి వచ్చిన తీరును చూసిన తర్వాత ఫైనల్స్ లోనూ బెంగళూరును బెంబేలెత్తించే అవకాశముంటుందని భావించారు. క్రీడా నిపుణులు కూడా ఫైనల్స్ కు వస్తే ముంబయి ఇండియస్స్ దే ఈసారి కూడా ఛాంపియన్ షిప్ అని అన్నారు. చివరకు అశ్విన్ వంటి వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పంజాబ్ గెలిచింది. ముంబయి ఓడింది. దీంతో ముంబయి ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ నీరసంగా బయటకు వెళ్లడం కనిపించింది.
Next Story