Fri Dec 05 2025 14:57:49 GMT+0000 (Coordinated Universal Time)
PBKSvsMI: ఫైనల్ లో RCBతో తలపడేది ఎవరో?
జూన్ 3న జరగబోయే ఐపీఎల్-2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే జట్టు ఏదో నేడు తేలిపోనుంది.

జూన్ 3న జరగబోయే ఐపీఎల్-2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే జట్టు ఏదో నేడు తేలిపోనుంది. క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఎలిమినేటర్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబయి ఇండియన్స్ అదే జోరును క్వాలిఫయర్ 2లో చూపించాలని భావిస్తోంది.
క్వాలిఫయర్ 1లో ఘోర పరాభవం పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ మ్యాచ్ లో తిరిగి పంజాబ్ సత్తా చాటాలని భావిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధించి, టేబుల్ టాపర్గా లీగ్ దశను ముగించింది పంజాబ్. కాబట్టి, తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు మెండుగా ఉండడంతో అహ్మదాబాద్ వేదికగా బ్లాక్ బస్టర్ క్వాలిఫయర్ 2 ను క్రికెట్ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.
Next Story

