Fri Mar 20 2026 09:35:38 GMT+0530 (India Standard Time)
టాస్ గెలిచిన ఇండియా.. పాక్ బ్యాటింగ్
పాకిస్థాన్ - ఇండియా మ్యాచ్ మరికాసేపట్లో మొదలు కానుంది. ఇండియా టాస్ గెలించింది. భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

పాకిస్థాన్ - ఇండియా మ్యాచ్ మరికాసేపట్లో మొదలు కానుంది. ఇండియా టాస్ గెలించింది. భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. టాస్ గెలవడంతో భారత్ క్రికెట్ అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. స్టేడియం మొత్తం నిండిపోయింది. గ్యాలరీల్లో ప్రేక్షకుల అరుపులు, కేకలతో వాతావరణం ఉద్విగ్నంగా మారింది.
హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం...
హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. చాలా రోజుల తర్వాత దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో అందరూ ఇళ్లల్లోనే టీవీలకు అతుక్కుపోయారు.
Next Story

