Mon Feb 02 2026 03:42:26 GMT+0000 (Coordinated Universal Time)
సానియా ఇక కోర్టులో కన్పించరుగా
గ్లాండ్ స్లామ్ లో తన చివరి మ్యాచ్ లో సానియా, బోపన్న జోడీ ఓటమి పాలయింది.

గ్లాండ్ స్లామ్ లో తన చివరి మ్యాచ్ లో సానియా, బోపన్న జోడీ ఓటమి పాలయింది. ఇదే సానియాకు టెన్నిస్ లో చివరి మ్యాచ్ కావడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ లో విజయం సాధించి చివరి మ్యాచ్ లో గెలవాలని అందరూ ఆకాంక్షించారు. అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఆశలు నెరవేరలేదు. ఈరోజు రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన మ్యాచ్ లో 6-7. 2 -6తో ఓటమి చెందారు.
ఏకపక్షంగానే...
తొలిసెట్ లో ఆధిక్యంలోకి వెళ్లినా తర్వాత వెనకబడటంతో సానియా, బోపన్న జోడీ పరాజయం పాలయింది. సానియా టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్దులను సొంతం చేసుకున్న సానియా తన కెరీర్ ముగింపు మ్యాచ్ లో నయినా గెలుస్తారనుకుంటే అది సాధ్యం కాలేదు. సానియా ఇక టెన్నిస్ కోర్టులో కనిపించదన్న బాధను ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. సానియా జట్టుకు ఈ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఓటమితో ఇంటి దారి పట్టారు.
Next Story

