Tue Jan 20 2026 02:41:14 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరు టెస్టులో బుమ్రా ఫైర్.. 109 కే శ్రీలంక ఆలౌట్
టీమిండియా - శ్రీలంక మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ కు శ్రీలంక దాసోహమవ్వక తప్పలేదు.

బెంగళూరులో టీమిండియా - శ్రీలంక మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ కు శ్రీలంక దాసోహమవ్వక తప్పలేదు. బుమ్రా తన బౌలింగ్ తో 5 వికెట్లతో విజృంభించగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 86-6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. కొద్దిసేపటికే పెవిలియన్ కు చేరింది.
నిన్నటి మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన బుమ్రా.. నేడు ఆట ఆరంభంలోనే 2 వికెట్లు తీశాడు. అశ్విన్ మరో రెండు వికెట్లు పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ లో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేయగా, ఎంబుల్దెనియ 21 పరుగులు చేశాడు. కాగా.. టీమిండియా తొలి ఇన్సింగ్స్ లో 252 పరుగులు చేయడంతో.. 143 పరుగుల ఆధిక్యం లభించింది.
Next Story

