Fri Apr 10 2026 11:13:05 GMT+0530 (India Standard Time)
IPL 2026 : నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్
నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది

ఐపీఎల్-2026లో భాగంగా నేడు మరొక బిగ్ ఫైట్ జరగనుంది. శుక్రవారం గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు అద్భుత ఫామ్లో ఉన్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకూ ఆడిన ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు.
ఇరుజట్లు విజయాలతోనే...
రాజస్థాన్ రాయల్స్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన 31 మ్యాచ్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 14 సార్లు గెలుపొందాయి. దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
Next Story

