Sun Feb 01 2026 10:07:57 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇండియా - శ్రీలంక వన్డే మ్యాచ్
భారత్ - శ్రీలంక మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. గౌహతిలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది

భారత్ - శ్రీలంక మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. గౌహతిలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలన్న కసితో ఉంది. ఇప్పటికే టీ 20 సిరీస్ ను చేజిక్కించుకున్న భారత్ వన్డే సిరిస్ పై కన్నేసింది. ఈ ఆటకు జస్ప్రిత్ బూమ్రా దూరంగానే ఉన్నారు. ఆయన గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది.
గట్టి పోటీ ఇచ్చి...
శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయలేం. టీ 20 సిరీస్ లోనే భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది. తొలి టీ 20 లో కేవలం రెండు పరుగుల తేడాతోనే ఓటమి పాలయింది. రెండో టీ 20 గెలిచింది. మూడో టీ 20లో మాత్రం సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడటంతో కొంత తడబడింది. అయితే వన్డేల్లో తమ సత్తా చూపాలని శ్రీలంక భావిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లిలు మళ్లీ జట్టులోకి రావడంతో భారత్ అభిమానుల్లో సంబరం మొదలయింది.
Next Story

