Fri Dec 05 2025 13:50:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వెస్టిండీస్ - ఇండియా వన్డే
సిరీస్ సొంతమయ్యే వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. వెస్టిండీస్ తో ఇండియా రెండో వన్డే నేడు జరగనుంది.

సిరీస్ సొంతమయ్యే వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. వెస్టిండీస్ తో ఇండియా రెండో వన్డే నేడు జరగనుంది. అందుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్ లో కేవలం మూడు పరుగులు తేడాతో ఓటమి పాలయిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలని తహతహలాడుతుంది. తృటిలో విజయం దూరమయిందన్న భావనలో ఉన్న ఆ జట్టు సొంత గడ్డపై విజయాన్ని చవిచూడాలని కోరుకుకుంటుంది. అందుకోసం పూరన్ జట్టు తెగించి ఆడే అవకాశముంది.
రెండో మ్యాచ్ లోనూ....
ఇండియా కూడా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని గట్టిగానే కసరత్తులు చేస్తుంది. గత మ్యాచ్ లో బ్యాటర్లు కొంత మెరుగైన ఆట కనపర్చినా, బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారని భావిస్తుంది. అందుకే ఈసారి వెస్టిండీస్ జట్టును మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచి సొంతం చేసుకుని పరాయి గడ్డపైనా విజజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఇరు జట్లు పెద్దగా మార్పుల్లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. థావన్ నాయకత్వంలోని భారత్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటుందా? మూడో మ్యాచ్ కోసం వేచి చూడాలా? అన్నది ఈరోజు తేలనుంది.
Next Story

