Sat Dec 13 2025 22:35:10 GMT+0000 (Coordinated Universal Time)
India Vs South Africa : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రోకోలు రీ ఎంట్రీ
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం సొంత మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ ఓడిపోతుండటంతో వన్డే మ్యాచ్ లలోకి సీనియర్లను రంగంలోకి దించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను వన్డే మ్యాచ్ లలో ఆడించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ ఈ నెల 22వ తేదీన గౌహతిలో ప్రారంభం కానుంది. 26వ తేదీతో ముగుస్తుంది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లను భారత్ ఆడనుంది. అందులో భాగంగా నవంబరు 30వ తేదీన రాంచీ వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.
గాయాలతో ఇబ్బంది పడుతూ...
భారత్ కెప్టెన్ శుభమన్ గిల్ గాయంతో ఇప్పటికే ఇబ్బందిపడుతుండగా, హార్థిక్ పాండ్యా కూడా అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలో సీనియర్లు జట్టుకు అవసరమని భావించిన బీసీసీఐ విరాట్, రోహిత్ లను తిరిగి వన్డేలోకి రప్పించాలని భావిస్తుంది. హార్థిక్ పాండ్యా కూడా అందుబాటులో లేకపోవడం, శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడటంతో ఈ ఇద్దరి రాక అనివార్యమని భావిస్తున్నారు. అయితే హార్థిక్ పాండ్యా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత్ తో దక్షిణాఫ్రికా తలపడే టీ 20 సిరీస్ కు కూడా వీరు అందుబాటులో ఉండరు. అంతా కొత్త వారితో తలపడాలంటే వన్డే సిరీస్ విషయంలో కొంత జట్టు ఇబ్బంది పడాల్సి వస్తుందమోనని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాటింగ్ ఆర్డర్ ను బలోపేతం చేసే దిశగా...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు రుతురాజ్ గైక్వాడ్ కు కూడా అవకాశం ఇవ్వాలని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. బౌలింగ్ పరంగా కొంత పరవాలేదనుకున్నా, బ్యాటింగ్ పరంగా కొంత భారత్ తడబడుతుంది. యశస్విజైశ్వాల్ ఫామ్ లో లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారనమని అంటున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యశస్విజైశ్వాల్ తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉంటే బ్యాటింగ్ పటిష్టంగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.అలాగే స్పిన్నర్లు అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు కొనసాగుతారు. ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ను కొనసాగించవచ్చు. ఇక శివమ్ దూబె, నితీష్ కుమార్ రెడ్డిలలో ఆల్ రౌండర్ కోటాలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద భారత జట్టులో భారీ మార్పులతో వన్డే సిరీస్ కు రానుందని తెలిసింది.
Next Story

