Fri Dec 05 2025 16:19:06 GMT+0000 (Coordinated Universal Time)
బాల్ అంచనా వేయలేకపోయిన నితీష్ రెడ్డి
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శార్దుల్ ఠాకూర్ ప్లేసులో తుది జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిరాశపరిచాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శార్దుల్ ఠాకూర్ ప్లేసులో తుది జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన నితీశ్ రెడ్డి ఇంగ్లాండ్ గడ్డపై ఆడుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రిషభ్ పంత్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు నితీశ్. జట్టును ఆదుకుంటాడని భావించగా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి క్రిస్ ఓక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతి వికెట్లకు దూరంగా వెళ్తుందని భావించిన నితీశ్. బ్యాట్‌ను పైకెత్తాడు. కానీ బంతి కాస్త టర్న్ అయి ఆఫ్ వికెట్‌ను తాకింది. దీంతో నితీశ్ కుమార్ రెడ్డి నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు.
Next Story

