Fri Dec 19 2025 02:29:27 GMT+0000 (Coordinated Universal Time)
New Zealand Vs South Africa T20 Word Cup : పథ్నాలుగేళ్లు తర్వాత కలల సాకారం.. న్యూజిలాండ్ విజయం
ప్రపంచ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాతో పోరాడి విజయం సాధించింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. దాదాపు పథ్నాలుగేళ్ల తర్వాత ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు మైదానంలోనే చిందులు వేశారు. ఆనందంతో ఊగిపోయారు. కప్పును ఎత్తుకుని టీం సభ్యులు ఒక్కొక్కరుగా ముద్దాడుతూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.
32 పరుగుల తేడాతో...
ప్రపంచ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాతో పోరాడి విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇరవై ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఐదు వికెట్లను కోల్పోయింది. ఇరవై ఓవర్లలో 158 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందుంచింది. అయితే సౌతాఫ్రికా బ్యాటర్లు ఇరవై ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో వరల్డ్ కప్ న్యూజిలాండ్ సొంతమయింది.
Next Story

