Sat Dec 06 2025 07:31:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు న్యూజిలాండ్ తో తలపడనున్న శ్రీలంక

New Zealand vs Sri Lanka, T20 ప్రపంచ కప్ 2022 : ఐసిసి వరల్డ్ టి 20 2022లో భాగంగా ఆసియా కప్ విజేత శ్రీలంకతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ తలపడనుంది. సెమీ-ఫైనల్ లో అడుగుపెట్టాలంటే న్యూజిలాండ్ కు ఈ మ్యాచ్ విజయం ఎంతో కీలకం. ఇక శ్రీలంకకు టోర్నీలో నిలవాలంటే తప్పకుండా విజయాన్ని అందుకోవాల్సి ఉంది. సూపర్ 12 దశలో ఆస్ట్రేలియాలో కురుస్తున్న వర్షాలు మ్యాచ్ లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో కీలకమైన రెండు పాయింట్ల కోసం న్యూజిలాండ్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ SCGలో తమ సూపర్ 12 మొదటి మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. పెర్త్లో డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఫేవరెట్గా పరిగణించబడుతున్న న్యూజిలాండ్ కు గ్రూప్ టాపర్ గా నిలిచి సెమీస్ కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ ప్రారంభం అవ్వనుంది.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్సే, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, అషెన్ బండార, ప్రమోద్ మధుషన్, కసున్ రజిత జెఫ్రీ వాండర్సే
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్
Next Story

