Mon Dec 15 2025 04:47:16 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa 3rd 20 : ధర్మశాలలో టీం ఇండియా మ్యాజిక్ చూశారా?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడో టీ20లో టీం ఇండియా అద్భుతమైన విజయం సాధించింది

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడో టీ20లో టీం ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. బౌలర్లు విజృంభించడంతో భారత్ విజయం సులువుగా మారింది. టాస్ గెలిచిన టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తక్కువ పరుగులకే దక్షిణాఫ్రికాను పెవిలియన్ బాట పట్టించింది. రెండో టీ20లలో అత్యథిక పరగులు చేసిన వారందరీని వరసగా అవుట్ చేసి అతి తక్కువ పరుగులకే అవుట్ చేయగలడంతో భారత్ ఛేదనలో పెద్దగా ఇబ్బంది లేదు. భారత్కు ఏడు వికెట్లు మిగిలి ఉండగానే సులువు విజయం దక్కింది.
బౌలర్లు... బ్యాటర్లు కలసి...
ధర్మశాల లో పేసర్లు స్వింగ్ మాయ చూపిన తర్వాత, అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే వికెట్లు దక్కాయి. అర్ష్దీప్ సింగ్ రెండు, హర్షిత్ రాణా రెండు, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో కేవలం దక్షిణాఫ్రికా 117 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే...
ఇక మూడో టీ20లలో భారత్ ఓపెనర్లు శుభారంభంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించడం విశేషం. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ నిలకడగా ఆడుతూ స్కోరును వేగంగా పెంచాడు. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు అభిషేక్ 35 పరుగులు, వైస్ కెప్టెన్ గిల్ 28 పరుగులు, తొలి వికెట్కు 5.2 ఓవర్లలో 60 పరుగులు జోడించారు. ఛేజింగ్ ఆరంభంలోనే అభిషేక్ ఒకే ఓవర్లో 16 పరుగులు ఇచ్చేలా చేశాడు. తొలి బంతికే సిక్సర్ బాది ఉద్దేశం స్పష్టంగా చూపించాడు. తిలక్ వర్మ మరోసారి నిలకడగా ఆడి టీం ఇండియాను గెలిపించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2–1 ఆధిక్యం సాధించింది. దీంతో భారత్ మరోసారి బౌలింగ్, బ్యటింగ్ లో తిరుగులేదనిపించుకుంది.
Next Story

