Tue Apr 07 2026 13:15:04 GMT+0530 (India Standard Time)
IPL 2026 : నేడు ఐపీఎల్ లో టఫ్ ఫైట్
నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది

ఐపీఎల్ లో నేడు మరో టఫ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు గుహవటి వేదికగా జరగనుంది. రెండు బలమైన జట్లే కావడంతో ఎవరిది గెలుపు అన్నది చివరి వరకూ తేలే అవకాశం లేదన్నది క్రీడా విశ్లేషకుల అంచనా గా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్...
రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబయి మాత్రం ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అయితే బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలమైన జట్లు కావడంతో ఈరోజు గుహవటి వేదికగా టఫ్ ఫైట్ జరగనుంది.
Next Story

