Fri Dec 05 2025 13:04:26 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : హైదరాబాద్ మెడలను వంచిన ముంబయి.. తక్కువ పరుగులకే?
ముంబయి ఇండియన్స్ తన సొంత మైదానమైన ముంబయిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది

ఐపీఎల్ సీజన్ లో నిన్నటి వరకూ ఓటములను చవిచూసిన జట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇప్పటి వరకూ పాయింట్ టేబుల్ కు చివరి స్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు క్రమంగా పుంజుకుంటుంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మాత్రం మార్పు రాలేదు. వరస ఓటములను దాని వెంట పరుగులు పెడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ తన సొంత మైదానమైన ముంబయిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. అలవోకగా విజయం సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో ఇప్పుడు మిగిలిన జట్ల సరసన చేరుకుంది. ముంబయి జట్టు ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడింది.
సన్ రైజర్స్ తక్కువ స్కోరుకు...
తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో అభిషేక్ శర్మ తొలుత నలభై పరుగులు చేశారు. ఓపెనర్ గా వచ్చిన మెడ్ కూడా 28 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా నిరాశ పర్చాడు. నితీశ్ కుమార్ 19 పరుగులు మాత్రమే చేసి అవుటయి పెవిలియన్ బాట పట్టాడు. క్లాసెన్ 37పరుగులు చేసి అవుట్ కావడంతో అనికేత్ వర్మ నాటౌట్ గా నిలిచి 18 పరుగులను మాత్రమే చేయగలిగారు. దీంతో ఇరవై ఓర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌల్ట్, బుమ్రా, హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీసుకోగా, జాక్స్ రెండు కీలక వికెట్లను దక్కించుకున్నాడు.
తక్కువ స్కోరుకు...
తర్వాత బరిలోకి దిగిన అతి తక్కువ స్కోరును ఛేదించడంలో ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. తొలి నుంచి దూకుడుగానే ఆట మొదలుపెట్టింది. రికిల్ టన్ 31 పరుగులు చేసి అవుటవ్వగా, రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి 26 పరుగులు చేయగలిగాడు. జాక్స్ 36 పరుగులు చేశఆడు. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేయగా, తిలక్ వర్మ నాటౌట్ గా నిలిచి 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హార్థిక్ 21 పరుగులు చేసి అవుటయినా ముంబయి ఇండియన్స్ చివరకు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 18.1 ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్లు కోల్పోయి 166 పరుగుల చేసి ఈ సీజన్ లో మూడో విజయాన్ని అందుకుంది.
Next Story

