Mon Mar 30 2026 09:40:50 GMT+0530 (India Standard Time)
IPL 2026 : ముంబయిదే విజయం.. సులువుగా అతి పెద్ద టార్గెట్ ఛేదన
ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది.

ముంబయి ఇండియన్స్ మెరిసింది. ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ లలో ఓటములను చవిచూస్తూ వచ్చిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ లో మాత్రం తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, రికిల్ టెన్ నిల్చుని అతిపెద్ద టార్గెట్ ను ఛేదించగలిగారు. 221 పరగుల లక్ష్యాన్ని మరో ఐదు పరుగులు మిగిలి ఉండగానే సాధించింది. దీంతో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది. తమ సత్తా ను చాటింది. ఐదు సార్లు చాంపియన్ గా నిలిచిన తమ జట్టుకు తిరుగు లేదని మరొక సారి నిరూపించుకుంది
ఆరంభంలో అదరగొట్టి...
రోహిత్ శర్మ 78 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 81 పరుగులు చేసి ఆరంభంలో ముంబయికి ఊతమిచ్చారు. ఆ ఉత్తేజాన్ని అందిపుచ్చుకన్న మిగిలిన ఆటగాళ్లు చెలరేగిపోయారు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్ కత్తా నైట్ రైడర్స్ విధించి 221 పరుగులను సులువుగా ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ పెట్టిన 221 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 19.1 ఓవర్లలోనే 224 పరుగులు సాధించింది.
ఇద్దరూ అర్థశతకాలతో...
రోహిత్ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 78 పరుగులు సాధించాడు. మరోవైపు రికెల్టన్ 43 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 81 పరుగులు చేసి రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 72 బంతుల్లో 148 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు.రోహిత్ తన క్రీజ్ కదలికలతో బంతులను అంచనా వేసి చక్కటి షాట్లు ఆడాడు. బ్లెసింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ ఆకట్టుకుంది. వరుణ్ చక్రవర్తి బంతిని కవర్ మీదుగా ఎగరేసిన షాట్ కూడా మెప్పించింది. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌తో 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. చివరలో హార్దిక్ పాండ్యా , నమన్ ధీర్ జట్టును గెలిపించారు.
రహానే, రఘువంశి మెరుపులు...
ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 67పరుగులు, అంగ్క్రిష్ రఘువంశి 51 పరుగులతో రాణించారు. శార్దూల్ ఠాకూర్ మూడు కీలక వికెట్లు తీసి ముంబయికి ఊపిరి పోశాడు. ఫిన్న్ అలెన్ 37 వేగంగా ఆడగా, అల్లా ఘజన్ఫర్ బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసే సరికి కేకేఆర్ 78 పరుగులకు ఒక వికెట్ మాత్రమే నిలిచింది. ఎనిమిదో ఓవర్లోనే 100 పరుగులు దాటింది. రహానే ఓ దశలో భారీ స్కోరు దిశగా సాగాడు. కానీ ఠాకూర్ రెండు విడతల్లో వికెట్లు తీసి కేకేఆర్ వేగాన్ని తగ్గించాడు. ముంబయి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రహానే కండరాల పట్టివలన మైదానం విడిచిపోవడం కేకేఆర్ శిబిరంలో ఆందోళన కలిగించింది.
Next Story

