Tue Jul 15 2025 15:49:11 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఆరంభంలో తడబడి తేరుకున్న ముంబయి.. ఆదిలోఅదరగొట్టి బోల్తా పడిన ఢిల్లీ
ముంబయి లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ పై ముంబయి ఇండియన్స గెలిచి ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంది. ఢిల్లీ కాపిటల్స్ ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంది.

ఐపీఎల్ 18 వ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేసుకు వస్తుందని అందరూ అంచనా వేశారు. ఐపీఎల్ సీజన్ స్టార్టయిన తొలి నాళ్లలో ఢి్లీ కాపిటల్స్ వరస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే ముంబయి ఇండియన్స్ మాత్రం వరస ఓటములతో తడబడుతోంది. దీంతోఈ రెండింటిలో ఢిల్లీయే ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబయి ఓటముల నుంచి తేరుకుని విజయాల బాట పట్టింది. ఢిల్లీ మాత్రం వరస గెలుపు తర్వాత ఇక అపజయాలను మూటగట్టుకుని ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. నిన్న ముంబయి లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ పై ముంబయి ఇండియన్స గెలిచి ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంది. ఢిల్లీ కాపిటల్స్ ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంది.
తక్కువ పరుగులకే...
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ లో ఆదిలో పెద్దగా ఆరంభం దొరకలేదు. రికిల్ టన్ ఇరవై ఐదు పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఐదు పరుగులుకే వెనుదిరిగి నిరాశపర్చాడు. విల్ జాక్స్ ఇరవై ఒక్క పరుగుల చేశాడు.సూర్యకుమార్ మాత్రం నాటౌట్ గా నిలిచి ముంబయి ఇండియన్స్ కు మంచి స్కోరు సంపాదించి పెట్టాడు. సూర్య కుమార్ యాదవ్ 73 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఇరవై ఏడు, హార్ధిక్ పటేల్ మూడు, నమీన్ ధీర్ నాటౌట్ గా నిలిచి 24 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఇండియన్స్ ఇరవై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇది స్వల్ప లక్ష్యమేనని చెప్పాలి. ఢిల్లీ కాపిటల్స్ కు ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు.
చేధనలో చేతులెత్తేసి...
తర్వాత ఛేదనలో ఢిల్లీ కాపిటల్స్ చేతులెత్తేసింది. ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ పదకొండు పరుగులకే అవుటయ్యాడు. డుప్లెసిస్ ఆరు పరుగులు చేసి వెనుదిరిగాడు. పోరెల్ ఆరు పరుగుుల చేశఆడు రిజ్వీ 39 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. విప్రాజ్ నిగమ్ ఇరవై పరుగులు, స్టబ్స్ రెండు పరుగులు, రికిల్ టన్ పద్దెనిమిది పరుగులు చేసి అవుటయ్యాడరు. మాధవ్ తివారీ మూడు, చమీర ఎనిమిది పరుగులు ేయడంతో 18.2 ఓవర్లలోనే ఢిల్లీ కాపిటల్స్ ఆల్ అవుట్ అయింది. కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ లోకి వెళ్లిపోగా, ఢిల్లీ కాపిటల్స్ మాత్రం ఇంటిదారి పట్టింది. బుమ్రా మూడు వికెట్లు తీసి ఢిల్లీ కాపిటల్స్ ను చావుదెబ్బతీశాడు.
Next Story