Thu Dec 18 2025 17:57:13 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ చరణ్ ఇంటికి టీమ్ ఇండియా క్రికెటర్లు
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ టీం ఇండియా క్రికెటర్లకు విందు ఇచ్చారు

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ టీం ఇండియా క్రికెటర్లకు విందు ఇచ్చారు. నిన్న ఉప్పల్ లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ గెలిచిన అనంతరం టీం ఇండియా క్రికెటర్లు కొందరు రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. ఆయన టీం ఇండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు క్రికెటర్లు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా టీం ఇండియా క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు.
హార్ధిక్ పాండ్యాతో...
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించి RRR సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా విషయాన్ని కూడా కొందరు క్రికెటర్లు ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రధానంగా నాటు నాటు పాటకు హార్దిక్ పాండ్యా సోదరులు ఒక ప్రకటన చేశారు. దీంతో హార్ధిక్ పాండ్యా ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారంటున్నారు. అయితే త్వరలోనే సోషల్ మీడియాలో రామ్ చరణ్ విందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేయనున్నారు. కానీ ఈ లోగానే చరణ్ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి హార్థిక్ పాండ్యాతో లిఫ్ట్ లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
Next Story

