Fri Dec 05 2025 16:25:22 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025: నేడు ఐపీఎల్ లో డబుల్ ధమాకా
గుజరాత్ టైటాన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ ఢీకొంటుంది

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. కీలక మ్యాచ్ లు కావడంతో శనివారం మ్యాచ్ లు రెండు క్రికెట్ అభిమానులు అలరించేవిగా ఉంటాయి. ఐపీఎల్ సీజన్ లో కొన్ని మ్యాచ్ ల కోసం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ సీజన్ లో కొన్ని జట్లు అనూహ్యంగా విజయాన్ని అందుకుంటూ అందరి అంచనాలకు భిన్నంగా పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి. అలాంటి మ్యాచ్ లు శని, ఆదివారాలు ప్రత్యేకంగా మధ్యాహ్నం, రాత్రికి రెండు మ్యాచ్ లు జరుపుతూ ఐపీఎల్ ను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు.
రెండు మ్యాచ్ లతో...
గుజరాత్ టైటాన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నోలో జరుగుతుంది. రెండో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ ఢీకొంటుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఐదు మ్యాచ్ లో నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు మ్యాచ్ లు ఆడి మూడింటిలోనే గెలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లు గెలవగా, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి పాయింట్ టేబుల్ చివరలో ఉంది. అందుకే లక్నో, హైదరాబాద్ లు గెలుపు కోసం తమ సొంత మైదానంలో శ్రమిస్తాయని చెప్పక తప్పదు.
Next Story

