Fri Dec 05 2025 12:25:39 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : వర్షం మ్యాచ్ ను మింగేసింది.. పంజాబ్ నాలుగో స్థానంలో ఉన్నా ప్లేఆఫ్ ఆశలు?
పంజాబ్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చెరో పాయింట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

ఐపీఎల్ లో మ్యాచ్ లన్నీ చివరి దశకు దాదాపుగా చేరుకున్నాయి. ఇప్పుడు ప్లే ఆఫ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకూ తొలి నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్న అనేక టీంలు ఇక మ్యాచ్ లు జరిగే అన్నింటిలో విజయాన్ని సాధిస్తేనే ప్లేఆఫ్ కు చేరుకుంటాయి. అందుకే ఇక ముందు జరిగే మ్యాచ్ లన్నీ కీలకంగానే చెప్పుకోవాలి. తెగించి సాహసించి గెలుపు కోసం ప్రయత్నించాలి. లేకుంటే ప్లే ఆఫ్ కు చేరుకోక ముందే ఇంటిదారపడతాయి. ఇప్పటికే అనేక జట్లు తక్కువపాయింట్లతో ప్లే ఆఫ్ ఆశలు లేకుండా ఉన్నాయి.
ఈ రెండు జట్లలో...
తాజాగా పంజాబ్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ కూడా అంతే. ఈ మ్యాచ్ లో గెలుపు కోల్ కత్తా కంటే పంజాబ్ కింగ్స్ కు ఎంతో అవసరం. ఎందుకంటే భవిష్యత్ లో సులువుగా ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ఎగబాకాల్సి ఉంటుంది. కానీ నిన్న కోల్ కత్తాలో జరిగిన పంజాబ్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించినట్లయింది.
మంచి రన్స్ చేసినా...
తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేపట్టి మంచి స్కోరు సాధించింది. ప్రభమన్ సింగ్ 83 పరుగులు, ప్రియాంశ్ ఆర్యా 69 పరుగులు చేశారు. ప్రభమన్ సింగ్ ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లు బాదాడు. ప్రియాంశ్ ఆర్య ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. తర్వాత ఛేదన కోసం బరిలోకి దిగిన కోల్ కత్తానైట్ రైడర్స్ ఏడు పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలయింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో చెరో పాయింట్ లభించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ పదకొండు పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది. కోల్ కత్తానైట్ రైడర్స్ మాత్రం ఏడు పాయింట్లతో ఏడు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వచ్చే మ్యాచ్ లన్నీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ చేరుకోవడం సాధ్యమవుతుంది. వర్షం పంజాబ్ ను దారుణంగా దెబ్బతీసిందనే చెప్పాలి.
Next Story

