Sun Mar 15 2026 04:22:46 GMT+0530 (India Standard Time)
Paris Olympics : గురితప్పి.. చేజారిన పతకం
పారిస్ ఒలింపిక్స్ లో మనుబాకర్ కు పతకం చేజారింది

పారిస్ ఒలింపిక్స్ లో మనుబాకర్ కు పతకం చేజారింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలోకి మనుబాకర్ పడి పోయింది. దీంతో దక్కాల్సిన పతకం చేజారి పోయింది. ఇప్పటికే రెండు పతకాలను సాధించిన మను బాకర్ మూడో పతకాన్ని కూడా సాధిస్తుందని అందరూ భావించిన సమయంలో దురదృష్టం వెంటాడింది.
మూడు పతకాలను సాధిస్తారనుకుంటే?
మనుబాకర్ మూడో పతకాన్ని సాధించి ఒలింపిక్స్ లో మూడు పతకాలను సాధించిన మహిళగా రికార్డులకు ఎక్కుతారని అందరూ భావించారు. ఆమె 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మాత్రం గురి తప్పింది. పతకాన్ని చేజార్చుకోవడంతో మనుబాకర్ రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాడ్ లక్ మనూబాకర్.
Next Story

