Tue Jul 08 2025 17:56:13 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు ఐపీఎల్ లో బెంగళూరు vs లక్నో
నేడు ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ మ్యాచ్ లు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ క్వాలిఫయిర్స్ కు చేరుకుంది. ముంబయి ఇండియన్స్ ను ఓడించి క్వాలిఫయిర్స్ కు నేరుగా చేరుకుంది. అయితే ఇంకా కొన్ని మ్యాచ్ లు ప్లే ఆఫ్ రేసుకు చేరిన జట్లు ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లు పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో స్థానం కోసం ఖచ్చితంగా మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్లేఆఫ్ రేసుకు చేరిన జట్లు నిష్క్రమించిన జట్లతో ఇటీవల ఎక్కువగా ఓడిపోతున్నాయి.
బెంగళూరుకు కీలకం...
ఈరోజు ఐపీఎల్ మరో కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు మాత్రం ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే బెంగళూరు ఇప్పుడు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో పదిహేడు పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశముంది. అందుకే ఈ మ్యాచ్ బెంగళూరుకు కీలకమనే చెప్పాలి.
Next Story