IPL 2026 : చివరి బాల్ కు విజయం.. లక్నోది ఎంత లక్కంటే?
కోల్ కత్తా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది

ఐపీఎల్ సీజన్ లో ఉత్కంఠ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చివరి బంతితో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టేసింది.గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి పేస్ బౌలింగ్ అనుభవలేమి మూలంగా మూల్యం చెల్లించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో లక్నో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రూకీ ముకుల్ చౌధరి చివర్లో చెలరేగగా, ఆయుష్ బడోని అర్ధశతకంతో బలమైన పునాది వేశాడు. 181 పరుగుల లక్ష్యాన్ని కాపాడే క్రమంలో కేకేఆర్ ఒక దశలో ఆధిపత్యం చెలాయించింది. ఈ సీజన్లో తొలిసారి బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ రెండో బంతికే లఖ్నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ను ఔట్ చేశాడు. అయితే వెన్ను శస్త్రచికిత్స తర్వాత పని భారాన్ని తగ్గిస్తూ వచ్చిన గ్రీన్ చివరి ఓవర్లలో అదే రిథమ్ చూపలేకపోయాడు.

