Fri Dec 05 2025 14:34:35 GMT+0000 (Coordinated Universal Time)
కోనేరు హంపి అరుదైన రికార్డు
గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్, బ్రిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది.

కోనేరు హంపి అరుదైన రికార్డు సాధించింది. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్, బ్రిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది. ర్యాపిండ్ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత విజేతగా రికార్డులకు ఎక్కింది. తెలుగు అమ్మాయి అయిన కోనేరు హంపి ఈ అరుదైన రికార్డును సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశంసల వర్షం...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు ఆమెను ప్రశంసించారు. అభినందించారు. ఈ ఘనత సాధించిన హంపి దేశ ఘనతను చాటారని కొనియాడారు. ఈ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. అదే సమయంలో యువతకు మార్గదర్శకంగా హంపి నిలుస్తుందని ప్రశంసలతో ముంచెత్తారు. కోనేరు హంపి తెలుగు అమ్మాయి కావడం మనకు గర్వకారణమని తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

