Thu Jul 17 2025 00:24:54 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025: నేడు మళ్లీ ఐపీఎల్ ప్రారంభం
ఐపీఎల్ లో ఈరోజు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 18వ సీజన్ లో ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. పాక్ - భారత్ ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపు పదిహేడు మ్యాచ్ లు మిగిలిపోయాయి. నేటి నుంచి ప్రారంభమైన మ్యాచ్ లుజూన్ 3వ తేదీ న ఫైనల్స్‌తో ముగియనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఎంపిక చేసిన ఆరు స్టేడియాల్లో మాత్రమే ఈ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఈరోజు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది.
ఇద్దరికీ కీలకమే...
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పదకొండు మ్యాచ్ లు ఆడి ఎనిమిది మ్యాచ్ లలో గెలిచి మూడింటిలో ఓడింది. పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరొకవైపు కోల్ కత్తా నైట్ రైడర్స్ పన్నెండు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో గెలిచి ఒక మ్యాచ్ రద్దు కావడంతో పదకొండు మ్యాచ్ లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు అధికారికంగా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టినట్లే అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలవడం కోల్ కత్తా నైట్ రైడర్స్ కు కూడా కీలకమే. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభం కానుంది.
Next Story