Thu Jul 17 2025 00:28:27 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఆటను అడ్డుకున్న వరుణుడు.. ఇంటి దారిపట్టిన కోల్ కత్తా నైట్ రైడర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ఆరంభం రోజే వరుణుడు ఆటను అడ్డుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో నిన్న రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంటే అంతకు గంటకు ముందు నుంచి బెంగళూరులో వర్షం దంచి కొట్టింది. ఎంత సేపు వెయిట్ చేసినా ఫలితం కనిపించలేదు. నిజానికి చిన్న స్వామి స్టేడియంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వర్షం ఏ మాత్రం వెలిసినా వెంటనే సిబ్బంది మైదానాన్ని ఆటకోసం రెడీ చేసేవారు. కానీ వరుణుడు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుండపోతగా వర్షం కురియడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుఅంపైర్లు ప్రకటించారు.
చెరో పాయింట్ గా...
దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ గా ప్రకటించారు. పాక్ - భారత్ లు మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో మ్యాచ్ లు ఆగిపోవడానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల టేబుల్ లో పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నిన్న మ్యాచ్ కూడా రద్దవ్వడంతో ఒక పాయింట్ వచ్చి పదిహేడు పాయింట్లకు చేరి ప్లే ఆఫ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరినట్లే. దాదాపుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెర్త్ ఖాయమయింది. పన్నెండు మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది మ్యాచ్ లలో గెలిచి, మూడు మ్యాచ్ లలో ఓడి, ఒక మ్యాచ్ లో వర్షం కారణంగా రద్దు కావడంతో పదిహేడు పాయింట్లకు చేరుకుని ఇప్పటికీ టేబుల్ టాపర్ గా నిలిచింది.
ప్లేఆఫ్ కు దూరమై...
ఇక కోల్ కత్తా నైట్ రైడర్స్ మాత్రం దాదాపు ప్లేఆఫ్ కు దూరమయింది. పదమూడు మ్యాచ్ లు ఆడిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కేవలం ఆరు మ్యాచ్ లలో మాగ్రమే గెలిచింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కోల్ కత్తా నైట్ రైడర్స్ ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలవాల్సిన పరిస్థితుల్లో ఆట నిలిచిపోవడంతో అది ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. ఇక కోల్ కత్తా ఇంటి దారిపట్టినట్లే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం దాదాపు ప్లేఆఫ్ కు చేరుకున్నట్లే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ గెలిచినా ఖచ్చితంగా ప్లేఆఫ్ కు చేరుతుంది. ఓటమిపాలయినా దానికి ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన జట్ల ఫలితాలపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ రేసుకు వెళుతుందా? లేదా? అన్నది ఆధారపడుతుంది.
Next Story