Wed Dec 17 2025 14:05:47 GMT+0000 (Coordinated Universal Time)
కోహ్లీ శ్రమంతా వృథా.. కోల్ కతా చేతిలో చిత్తైన బెంగళూరు
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. జేసన్ రాయ్ 29..

కోల్‌కతా కు ఎట్టకేలకు విజయం దక్కింది. నాలుగు వరుస ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం అందుకుంది. 201 పరుగుల లక్ష్య ఛేదనలో 179 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు మరో ఓటమిని మూటగట్టుకుంది. విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసి బెంగళూరును ఆదుకున్నాడు. మిగిలిన ఆటగాళ్లలో మహిపాల్ లోమ్రోర్ 34, దినేశ్ కార్తీక్ 22 పర్వాలేదనిపించారు. బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకోగా, సుయాశ్ శర్మ, రసెల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. జేసన్ రాయ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, రాణా 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. జగదీశన్ 27, వెంకటేశ్ అయ్యర్ 31, రింకు సింగ్ 18, వీజ్ 12 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, విజయ్‌కుమార్ వైశాఖ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో పాలుపంచుకున్న వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది.
Next Story

