Fri Dec 05 2025 12:42:36 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Cricket Association ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు ఆయనకే!
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా

2025 వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదల బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా అందించడం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని తీసుకున్న మొదటి నిర్ణయం.
ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బీజేపీ విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, కౌన్సిలర్గా విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. విజయవాడ ఎంపీగా ఉన్న శివనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా ఇలాంటి మ్యాచ్లు జరుగుతాయని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మంగళగిరి, కడపలో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అవకాశాలు పొందలేని ప్రతిభావంతులైన క్రికెటర్లందరికీ ACA ఒక సహాయక వ్యవస్థగా నిలుస్తుందని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.
Next Story

