Wed Jul 16 2025 23:35:24 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యర్ సరికొత్త శకం.. ఒకే ఒక్కడు!!
ఐపీఎల్ 2025 సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించింది.

ఐపీఎల్ 2025 సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు.
2020 సీజన్లో ఢిల్లీ, 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్‌తో ఓడినా, ఆ పరాజయాన్ని తాము మరిచిపోయామని ఒకే ఒక్క మ్యాచ్‌తో జట్టును అంచనా వేయలేమని మ్యాచ్ అనంతరం అయ్యర్ చెప్పాడు. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి పంజాబ్ జట్టు మరోసారి అడుగుపెట్టింది.
Next Story