Sat Mar 07 2026 18:58:20 GMT+0530 (India Standard Time)
WTC ఫైనల్ కు వేళాయె.. విజయం ఎవరిని వరించేనో?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది. లార్డ్స్ మైదానంలో జూన్ 11 నుంచి జరిగే ఫైనల్ పోరులో విజేత కోసం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తూ ఉంది. 2023-25 సీజన్ ఛాంపియన్ ఎవరో ఈ టెస్ట్ మ్యాచ్ తో తేలనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి.
మేజర్ ఐసీసీ టైటిల్ ను గెలవాలని దక్షిణాఫ్రికా జట్టు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ఉంది. అది ఈసారైనా సాకారం అవుతుందని ఆ జట్టు అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఇక ఐసీసీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి కూడా వీలు లేదు. మూడు ఫార్మాట్లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఆస్ట్రేలియా 10 టైటిల్స్ సాధించింది. పిచ్ ఏ జట్టుకు అనుకూలిస్తుందో, ఏ జట్టు ఒత్తిడి నుండి బయట పడుతుందో త్వరలోనే తెలియనుంది.
Next Story

